G-GB3W50CLMM

చీకోలు సుందరయ్య



చీకోలు సుందరయ్య శ్రీకాళహస్తి సమీపంలో జన్మించారు. తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, వి ఆర్  లా కాలేజీలో చదివారు. ప్రైవేట్ గా ఎం ఏ సోషియాలజీ చేశారు. 36 సంవత్సరాలు ఏజీ ఆఫీసులో ఉద్యోగించి 2015లో రిటైర్ అయ్యారు. 30 సంవత్సరాలు పత్రికలతో అనుబంధం కొనసాగించారు. పల్లకి, స్రవంతి వారపత్రికలలో ప్రారంభించి ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఆదివారం అనుబంధంలో మూడు సంవత్సరాలు ఈనాడు దినపత్రికలో 1991 నుంచి 2005 వరకు 15 సంవత్సరాలు రాశారు. ఈనాడులో ఆదివారం ఈనాడు, వసుంధర ప్రతిభ, డైలీ స్పెషల్ పేజస్ లో విస్తృతంగా అనేక పేర్లతో రాశారు. 1000 ఇంటర్వ్యూలు చేశారు. తేజ తదితర వారపత్రికలు ‘పత్రిక’ జయంతి అనే మాస పత్రికలను నిర్వహించారు. ఈనాడు గ్రూప్ వారి  తెలుగువెలుగు పత్రికలో అనేక రచనలు చేశారు.చీకోలు సుందరయ్య  30 సంవత్సరాలు ఎ జి ఆఫీస్లో ‘రంజని’ తెలుగు సాహితీ సమితి కార్యదర్శిగా, అధ్యక్షులుగా  సేవ చేశారు. 50 గ్రంథాలు ప్రచురించారు వాటిలో విశ్వకవిత, అమ్మ, మా ఊరు,  దాంపత్యం వంటి కవితా సంకలనాలు, శేషేంద్ర శిఖరం, పాటల పూదోట వేటూరి, సినిమా చూద్దాం రండి, విమర్శకులు మెచ్చినవి, మంచి కథ, నచ్చిన కథ, మెచ్చిన కథ,  బహుమతి కథ వంటివి విశేష ప్రాచుర్యం పొందాయి. 1984లో రంజని కుందుర్తి కవితల పోటీ ప్రారంభించారు. 1984 నుంచి 2015 వరకు పోటీలో ఎంపికైన కవితలతో పది పుస్తకాలు తెచ్చారు. జంట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వచన కవులు ఆ పోటీల్లో పాల్గొన్నారు. అలాగే రంజని విశ్వనాథ పద్య కవితా పోటీలు నిర్వహించారు. రంజని నందివాడ భీమారావు కథల పోటీలు, రంజని రాయప్రోలు  రామకృష్ణయ్య కథల పోటీలు ప్రారంభించి ఎన్నో ఏళ్ళు నిర్వహించారు. రంజనితో పాటు కవన  వేదిక అనే సంస్థను నడుపుతున్నారు.  అలాగే నాయన ఫౌండేషన్, లావణ్య ఆర్ట్స్ థియేటర్ వంటి సంస్థలతో అనుబంధం ఉంది. సొంతంగా ప్రజలు ప్రభుత్వం, ఒక ఐఏఎస్ మా రమణ, పీవీ మన టీవీ, అద్దంలో ఆభరణం, తీర కవితలు తెచ్చారు. ప్రస్తుతం “ఒక గురువు గారు నలుగురు శిష్యులు” పుస్తకం సిద్ధమయింది. జంట నగరాల లోనే కాక జిల్లాల్లోనూ ఎన్నో కార్యక్రమాలలో  పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం, బుక్  ఎగ్జిబిషన్ సొసైటీ నుంచి సన్మానం వంటివి  పొందారు. ఆకాశవాణి తో అనుబంధం ఇంకా కొనసాగిస్తున్నారు.  ఈటీవీ2 ఎన్టీవీ వారి చర్చా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దిల్లి లోని నేషనల్ బుక్ ట్రస్ట్ కి 5 సంవత్సరములు సలహాదారుగా ఉన్నారు. పదవీ విరమణ  తర్వాత మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ లో కొంతకాలం పనిచేసి ప్రస్తుతం స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ లో పనిచేస్తున్నారు.


ఒక గురువుగారు నలుగురు శిష్యులు

ఒక గురువుగారు నలుగురు శిష్యులు

OKA GURUVUGAARU NALUGURU SISYULU.....Rs : 160/-....ప్రతులకు : ...చీకోలు సుందరయ్య,...హైదరాబాదు...సెల్: 91 9030000696....మరియు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు ......

₹160.00₹ Ex Tax: ₹160.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)