G-GB3W50CLMM

గోవర్దనం రాఘవాచార్యులు

 

నా గురించి..


శ్రీవేంకటేశ్వర వేదాన్తవర్ధినీ సంస్కృత కళాశాల, సీతారాంబాగ్,హైదరాబాద్ నాకు విద్యా భిక్ష ప్రసాదించిన పాఠశాల. ఆ సంస్థలోచేర్చి నన్ను ఒక విద్యావంతునిగా తీర్చిదిద్దిన నా పాలిటదేవతాస్వరూపుడు మా మామయ్య శ్రీమాన్ కందాడైరామానుజాచార్యులు. నేను పుట్టింది నాటి వరంగల్లు జిల్లా తొర్రూరుసమీపంలోని అమ్మాపురం. నాకు జన్మనిచ్చినవారు వైకుంఠవాసులుశ్రీమాన్ గోవర్ధనం కృష్ణమాచార్యులు - వేంకట నర్సమ్మగార్లు. అక్కున
చేర్చుకుని పెంచి పోషించిన వారు మా చిన్నాన్న గారు వైకుంఠవాసులుశ్రీమాన్ గోవర్ధనం రామానుజాచార్యులు. మా చిన్నమ్మగారు యాదగిరిలక్ష్మి గారు. విద్యా, జ్ఞాన ప్రదాతలు శ్రీమాన్ కందాడైరామానుజాచార్యులు యశోదమ్మగార్లు. చిన్నతనంలోనే అమ్మా,నాన్నలను కోల్పోయిన నాకు ఆ లోటు లేకుండా ఆత్మీయానురాగాలు
పంచిన వారు మా బావ, అక్కయ్య గార్లు శ్రీమాన్ మంగళగిరిరామానుజాచార్యులు - శ్రీలక్ష్మి.జ్ఞానం తెలిసింది. కోనాయపాలెం సీతారామాలయం.కోనాయపాలెం ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం. బాల్య దశలోనే జీవన పోరాటం ప్రారంభం కూడా అక్కడే. చిన్నమ్మ, చిన్నాన్న,అక్క శ్రీలక్ష్మిల సహకారముతో జీవనయానం కొనసాగింపు.మామయ్య, అత్తయ్య శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులుయశోదమ్మగార్లు ఉపనయన సంస్కారము జరిపించినారు. కొన్నాళ్లుదేవాలయాలలో దేవతార్చనలతో కాలం గడిచింది. మామయ్యప్రోద్బలము, సహకారము, చిన్నమ్మ అంగీకారముతో సీతారాంబాగ్ సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం.1978లో సంస్కృతం బి.ఓ.ఎల్. పట్టా స్వీకరణ. 21.08. 1978న శ్రీ సరస్వతీ శిశుమందిరం, నిర్మల్ రథాలగుడిలో నాటి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ దాస్యం సేనాపతిగారి
పర్యవేక్షణలో బ్రహ్మపురి రథాలగుడి ప్రధానాచార్యులు శ్రీ సరికొండకోటమరాజు గారి పరిశీలనానంతరం ఆచార్య వృత్తిలో ప్రవేశం.తర్వాత భైంసా, మంచిర్యాల, శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం,
రాంపూర్, అదిలాబాద్, వెంకటరమణనగర్ (ఖైరతాబాద్, హైదరాబాద్), తాండూరు (రంగారెడ్డి జిల్లా), భోనగిరి (నాటి నల్లగొండ జిల్లా) బాగువాడ - నిర్మల్, శ్రీశారదాదామం (బండ్లగూడ), ఆర్మూర్ (నిజామాబాద్ జిల్లా), నర్సాపూర్ (జి) (నాటి ఆదిలాబాద్ జిల్లా, చివరగా 2009లో శ్రీ సరస్వతీ శిశుమందిరం (ఉన్నత) మెదక్ నందు
శ్రీసరస్వతీ విద్యాపీఠం నుండి స్వచ్ఛంద సేవా విరమణ. సెప్టెంబర్, 2009లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్, వనస్థలిపురం, హైదరాబాద్ లో ఉపాధ్యాయుడిగా పున: ప్రవేశం. దశలోనే జీవన పోరాటం ప్రారంభం కూడా అక్కడే. చిన్నమ్మ, చిన్నాన్న, అక్క శ్రీలక్ష్మిల సహకారముతో జీవనయానం కొనసాగింపు.మామయ్య, అత్తయ్య శ్రీమాన్ కందాడై రామానుజాచార్యులుయశోదమ్మగార్లు ఉపనయన సంస్కారము జరిపించినారు. కొన్నాళ్లు
దేవాలయాలలో దేవతార్చనలతో కాలం గడిచింది. మామయ్యప్రోద్బలము, సహకారము, చిన్నమ్మ అంగీకారముతో సీతారాంబాగ్సంస్కృత కళాశాలలో విద్యాభ్యాసం.1978లో సంస్కృతం బి.ఓ.ఎల్. పట్టా స్వీకరణ.
21.08. 1978న శ్రీ సరస్వతీ శిశుమందిరం, నిర్మల్ రథాలగుడిలోనాటి ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి శ్రీ దాస్యం సేనాపతిగారిపర్యవేక్షణలో బ్రహ్మపురి రథాలగుడి ప్రధానాచార్యులు శ్రీ సరికొండకోటమరాజు గారి పరిశీలనానంతరం ఆచార్య వృత్తిలో ప్రవేశం.తర్వాత భైంసా, మంచిర్యాల, శ్రీవిద్యారణ్య ఆవాస విద్యాలయం,
రాంపూర్, అదిలాబాద్, వెంకటరమణనగర్ (ఖైరతాబాద్,హైదరాబాద్), తాండూరు (రంగారెడ్డి జిల్లా), భోనగిరి (నాటి నల్లగొండ
జిల్లా) బాగువాడ - నిర్మల్, శ్రీశారదాదామం (బండ్లగూడ), ఆర్మూర్
(నిజామాబాద్ జిల్లా), నర్సాపూర్ (జి) (నాటి ఆదిలాబాద్ జిల్లా,
చివరగా 2009లో శ్రీ సరస్వతీ శిశుమందిరం (ఉన్నత) మెదక్ నందు
శ్రీసరస్వతీ విద్యాపీఠం నుండి స్వచ్ఛంద సేవా విరమణ. సెప్టెంబర్,
2009లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్, వనస్థలిపురం, హైదరాబాద్ లో
ఉపాధ్యాయుడిగా పున: ప్రవేశం.

తప్పులను సవరించి తనదుశైలిని జూపి
శతకము సరిజేసే శక్తిమీర
భావములను వ్రాసి భావమ్ము వివరించి
నన్ను ప్రోత్సహించె నారసింహ
(నారసింహ అనగా పొడిచేటి నరసింహాచార్యులు)
మా పూర్వ విద్యార్థి. నిజామాబాద్ జిల్లావాసి చిరంజీవ
కొట్టూరు సుదర్శన్. ఆయన స్నేహితురాలు శీలం లలిత పుస్తకాన్ని
చక్కగా డిజైన్ చేసివ్వగా మరో విద్యార్థి చిరంజీవ చొల్లేటి రాజపాపీ
రెడ్డి పుస్తకము అచ్చువేయించి ఇస్తానన్నారు.
ఈ విధంగా ఆ శ్రీమన్నారాయణుని కృపాకటాక్షములు,
భగవద్భాగవత మంగలాశాసనములతో, అందరి ఆదరాభిమానములు
పొందుతూ, నా జీవిత భాగస్వామి చి||ల||సౌ|| విజయలక్ష్మి, కుమారుడు
చి|| రామకృష్ణమాచార్యులు - కోడలు చి||సౌ|| రమాదేవి. పెద్ద
అల్లుడు శ్రీమాన్ అళహరి శ్రీనివాసాచార్యులు - పెద్ద కూతురు
చి||సౌ|| శ్రీవాణి, మనుమలు చి|| అళహరి శ్రీకర వశిష్టాచార్యులు,
చి|| అళహరి శ్రీవత్సకౌను భాచార్యులు, చి|| అళహరి
శ్రీచక్రాంకి తాచార్యులు. చిన్న అల్లుడు శ్రీమాన్ ముడుంబై
కులశేఖరాచార్యులు
చిన్న కూతురు చి||ల||సౌ|| ఫణిశ్రీలతో
వారందరి ప్రేమానురాగాల మధ్య సుఖశాంతులతో జీవనగమనం
సాగుచున్నది.
మీ
సకల బుధజన విధేయుడు
గోవర్ధనం రాఘవాచార్యులు, విజయలక్ష్మి
వనస్థలిపురం, హైదరాబాద్.
మొబైల్: 9490048096, 7981169781.


విజయ రాఘవ శతకం

విజయ రాఘవ శతకం

VIJAYA RAGHAVA SHATAKAM...వెల: రూ.80/-....ప్రతులకు:....రచయిత:...- గోవర్ధనం రాఘవాచార్యులు...: వనస్థలిపురం, హైదరాబాద్....మొబైల్: 9490048096, 7981169781.....

₹80.00₹ Ex Tax: ₹80.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)