G-GB3W50CLMM

T S A KRUSHNA Moorthy

చల్లని పుణ్యభూమి మదనపల్లె (చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) లో 1950వ సంవత్సరంలో జన్మించాను.
నాతల్లిదండ్రులు శ్రీ టి. ఎస్. ఆంజనేయులు మరియు శ్రీమతి కమలాక్షి( కమలమ్మ) గార్లు.

నా శ్రీమతి బి. కళావతమ్మ.
టి. శివ భారత మూర్తి, ప్రసన్న లక్ష్మి నా పిల్లలు. ఎన్.కె. నిత్య, కె.రెడ్డప్ప కోడలు, అల్లుడు. ముగ్గురు మనవళ్ళు, ఒక మనవరాలితో నిండు దిగువ మధ్య తరగతి జీవితం అనుభవిస్తున్నాను.
1968 లో రాయడం మొదలు పెట్టాను. మొట్టమొదటి పెద్ద కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మెడ్రాస్ కళానికేతన్
స్టూడియో వారి గేవా కలర్ చిత్రాలతో 1971 లో ప్రచురితమైంది. కాస్త బాగా వ్రాయగల కథకుడుగా 1974 నుండి
గుర్తింపు. 300 కథలు, 10 పెద్ద కథలు, ఆరు నవలలు, వందకు పైగా పరిచయాలు, వ్యాసాలు, ముందు మాటలు
వ్రాసాను. వాటిలో 80 శాతం పైగా పత్రికలలో అచ్చయ్యాయి. తదుపరి గ్రంధ రూపాలు దాల్చాయి. ఇప్పటికి 16 గ్రంథాలు వెలువరించాను.
వాటిలో రెండు గ్రంథములు పునర్ముద్రణలు పొందాయి.

కొన్ని కథలు, ఒక నవల కన్నడ భాషలోకి, కొన్ని కథలు ఆర్ల భాష లోకి అనువదించ బడినవి.

2013 వరకు వెలువడిన నా రచనల మీద ఎస్వీ యూనివర్సిటీ నుండి శ్రీ ఏ. రమా కుమార్ యాదవ్ నాలుగు
సంవత్సరాలు పరిశోధన సల్ఫి పీహెచ్. డి పట్టం పొందారు.

3 పురస్కారాలు పొందిన నా ఆయుధం నవల మీద చెన్నై యూనివర్సిటీ నుండి డాక్టర్ మాడభూషి సంపత్ కుమార్ గారి పర్యవేక్షణలో శ్రీ జి. శ్రీధర్ పిహెచ్. డి చేయుచున్నారు.
పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారి ఉత్తమ గ్రంథ నవలా పురస్కారం, మరసం పురస్కారం,
చిరసం పురస్కారం, భరత ముని ఆర్ట్స్ అకాడమీ వారి కళారత్న అవార్డు, డాక్టర్ కవిత స్మారక జాతీయ పురస్కారం(కడప), గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం (నెల్లూరు), కుప్పం రెడ్డమ్మ సాహిత్య పురస్కారం..

ఇలా పలు పురస్కారాలు, అవార్డులు 25 వరకు పొందడం జరిగింది..

మదనపల్లె సాహితీ కళా వేదిక అధ్యక్షుడిగా మూడు సంవత్సరాల పాటు సేవలందించాను.

ప్రజా చైతన్య స్రవంతి ఉపాధ్యక్షునిగా గత నాలుగు సంవత్సరాలుగా సేవలందిస్తున్నాను.


ప్రకృతిని ప్రేమించడం, సంగీతాన్ని ఆస్వాదించడం, మనుషుల్ని గూర్చి ఆలోచించడం, ప్రస్తుత సమాజాన్ని చూసి బాధ పడడం నా హాబీలు.

జై హింద్.


కొత్త బంగారు లోకం

కొత్త బంగారు లోకం

TSA KRISHNA MOORTHY,...MADANAPALLE,...PIN: 517 325...cell 91 9347298942...16 సంవత్సరాల క్రితం ఒక ప్రముఖ వారపత్రికలో ఆరు నెలల పాటు  ధారా వాహికగా ప్రచురింపబడి సంచలనం కలిగించిన తదుపరి గ్రంధ రూపేనా ప్రధమ, ద్వితీయ ముద్రణలు పొంది హైదరాబాదు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి నుండి ఉత్తమ గ్రంథ నవలా పురస్కారం పొందిన నవల కొత్త బంగారులోకం.         కథా నవలా రచయితగా, సద్విమర్శకులుగా ప్రసిద్ధులైన టీఎస్ ఏ కృష్ణమూర్తి గారి కలం నుండి వెలువడిన ఈ నవలను ప్రఖ్యాత కన్నడ రచయిత్రి, సుప్రసిద్ధ అనువాదకులు అయిన శ్రీమతి విజయ శంకర గారు కొత్త బంగారు లోకం నవలను" కవలు దారి "( కాలి దారి ) పేరిట అనువదించగా గ్రంధరూపంలో వెలువడి10_2_2021  నాడు మైసూరులో ఆవిష్కరింపబడిన ది.చిత్రాలలో సదరు సభలో అనువాదకురాలిని సన్మానిస్తున్న రచయితలు, గీతా మరియు సాహిత్య సుగతి సభ్యులు ఉన్నారు.N.శ్రీనివాసులునాయుడుమదనపల్లె -517 325TSA KRISHNA MOORTHY,...MADANAPALLE,...PIN: 517 325... cell 91 9347298942.....

₹0.00₹ Ex Tax: ₹0.00₹

Showing 1 to 1 of 1 (1 Pages)