G-GB3W50CLMM

'కళారత్న' బిక్కి కృష్ణ

ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు, కథారచయిత, గజల్ కవి, సినీ గేయ రచయిత, నవ్యాంధ్ర రచయితల సంఘం" అధ్యక్షులు కళారత్న బిక్కి కృష్ణ రాసిన కొన్ని పుస్తకాలను p.d.f .files రూపంలో పాఠకులకు అందుబాటులోకి తెస్తున్నాం. బిక్కి కృష్ణ రాసిన "కవిత్వం-డిక్షన్"కవితా నిర్మాణ పద్ధతులు కవులకు గైడ్ లాంటిది. ఆధునిక సాహితీ విమర్శలో 2018 సంవత్సరం కొలకలూరి భాగీరథమ్మ జాతీయ పురస్కారం పొందిన ఈ కవిత్వం-డిక్షన్ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచురించి ఉచితంగా కవులకు అందజేసింది. కొన్నివేల కాఫీలను కృష్ణగారు.. శతకవి, సహస్రకవి సమ్మేళనాలలో ఉచితంగా పంచి పెట్టారు. ఈ గ్రంథం ప్రతి కవికి కరదీపిక. అలాగే బిక్కి కృష్ణ రాసిన "కొత్తకోణం"విమర్శా గ్రంథం తెలుగు సాహిత్యంలో పెను దుమారం రేపింది. అలాగే ఆయన రాసిన "కాలం నది ఒడ్డున" కవితా సంపుటి గురించి రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డిగారు "ప్రపంచీకరణ పై సమరభేరి బిక్కికృష్ణ కాలం నది ఒడ్డున"అంటూ కితాబిచ్చారు. అలాగే బిక్కిగారు రాసిన "వాన వెలిశాక"కవితా సంపుటికి డా.ఎన్.గోపి ముందుమాట రాస్తూ వర్తమాన తెలుగు కవిత్వంలో బిక్కి కృష్ణ ఒక తుఫానులాంటి కవి అని ప్రశంసించారు. కవిగా తాను కవిత్వం రాయటమే గాక అనేక మంది చేత కవిత్వం రాయించడం ఒక కర్తవ్యంగా పెట్టుకున్న ఒక ఉద్యమ కవి బిక్కికృష్ణ.

    ఆయన ప్రతి కవిత గొప్ప నిర్మాణంతో సాగుతుంది. ఈ దశాబ్దపు మహాకవిగా బిక్కి కృష్ణ ధైర్యంగా నిబడతాడని ప్రముఖ విమర్శకులు ప్రత్యక్షవస్తుశిల్పాల గ్రంథం రచయిత శ్రీరామకవచం సాగర్   "వానవెలిశాక" ముందు మాటలో పేర్కొన్నారు. ఇంకా కె.శివారెడ్డి, నగ్నముని, శిఖామణి, ప్రసాదమూర్తి, మల్లెల తదితరుల ముందుమాటల ప్రశంసలతో వచ్చిన బిక్కికృష్ణ కవితా సంపుటాలను చదివితీరాలి. అలాగే ప్రముఖ కథావిమర్శకులు విహారి,ప్రముఖ నవలాకారులు, డా.ప్రభాకర్ జైనీ, ఆంధ్రప్రభ ఎడిటర్, వై.ఎస్.ఆర్.శర్మల ముందుమాటల సాధికారిక విశ్లేషణలతో వచ్చిన "సముద్రం నిద్రపోతోంది", "కవిత్వం-డిక్షన్"లతో పాటు, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాసులు, రాచపాళెం, తెలకపల్లి రవిల ముందుమాటల ప్రశంసలందుకున్న సంచలన విమర్శ"కొత్తకోణం"గ్రంథాన్ని ప్రతి ఒక్కరు తప్పక చదివి తీరాలి. బిక్కి కృష్ణ 600 గజల్స్ రాశారు. ప్రపంచ గజల్ సాహిత్యాన్ని ఔపోశన పట్టిన ఈయన ఆంధ్రప్రభ సాహితీ గవాక్షంలో గత కొన్ని నెలలుగా "గజల్ సౌందర్యం-సమీక్షణం"పేరుతో అద్భుతమైన వ్యాసాలు రాస్తున్నారు. ఇక బిక్కి కృష్ణ జీవితవిశేషాల్లోకెళితే అనంతపురం జిల్లా వడ్డేపాళ్యం గ్రామంలో జన్మించారు.

తొలుత ఆర్.డి.టి, సేవామందిరంలాంటి స్వచ్ఛంద సంస్థల్లో, తర్వాత డిగ్రీ, బిఎడ్ కళాశాలల్లో తెలుగు,ఫిలాసఫీ, సైకాలజి లెక్చరర్ గా పనిచేశారు. తర్వాత ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో హిందూపురం, అనంతపురం, హైదరాబాద్ లలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. 10 టి.వి.లో "అక్షరం" ప్రోగ్రాం ద్వారా ఐదేళ్ళు ఎందరో కవులు రచయితలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆరు వందల సాహిత్య, కళాసేవారంగాలను ఏకంచేసి ఎన్జీవోస్ నెట్ వర్  హైదరాబాద్ లో ఏర్పాటు చేసి సేవలు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఐదువేల శిక్షణా శిబిరాలు, వందలాది సాహితీ సభలు నిర్వహించారు.

గిడుగు ఫౌండేషన్, జైని ఫౌండేషన్, ఆరిగపూడి ఫౌండేషన్, చక్రి ఫౌండేషన్, వాసిరెడ్డి పౌండేషన్.. ఇలా ఎన్నో సంస్థల కార్యదర్శిగా ఉంటూ సాహితీ సేవలు, సాహితీ పురస్కారాలు అందిస్తున్న బిక్కి కృష్ణకు 2018 లో ఎ.పి. ప్రభుత్వం "కళారత్న" హంస పురస్కారంతో సత్కరించింది. ధిక్కార స్వరం, సాధికారిక స్వరం, విస్తృత సృజన ప్రపంచం, వైవిధ్యజీవితం ఉన్న బిక్కికృష్ణ సాహిత్యం ఉధృత చైతన్యప్రవాహం. సృజనకారులైన ప్రతి ఒక్కరు తప్పక చదివాలి.


కవిత్వం - డిక్షన్

కవిత్వం - డిక్షన్

..

₹0.00₹ Ex Tax: ₹0.00₹

కాలం నది ఒడ్డున

కాలం నది ఒడ్డున

..

₹0.00₹ Ex Tax: ₹0.00₹

కొత్త కోణం

కొత్త కోణం

..

₹0.00₹ Ex Tax: ₹0.00₹

వల్లరి - తెలుగు గజళ్లు
వాన వెలిశాక

వాన వెలిశాక

..

₹0.00₹ Ex Tax: ₹0.00₹

సముద్రం నిద్రపోతోంది
Showing 1 to 6 of 6 (1 Pages)