G-GB3W50CLMM

గుంటూరు శేషేంద్ర శర్మ

గుంటూరు శేషేంద్ర శర్మ 

ఆయన రూపం సుందరం, మాట మధురం, కవిత్వం రసభరితం. అలంకారశాస్త్రాలను ఔపోసన పట్టిన పండితుడు. మంచి వక్త, వ్యాసం, విమర్శ.. ఏది రాసినా ఆయన ముద్ర ప్రస్ఫుటం. ఆయనది విశ్వమానవదృష్టి. పాన పీన ఆహార విహారాల నుంచి నిత్యనైమిత్తిక కార్యాచరణలు, ఆలోచనలు... అన్నింటా ఆయన సంప్రదాయ, ఆధునిక తత్వాల మేళవింపు. 'సర్వేజనా స్సుఖినోభవంతు' అన్నది ఆయన ఆత్మనినాదం, ఘోషం. ఆత్మీయులకూ, అభిమానులకూ ఆయన శేషేన్‌, శేషేంద్ర. అటూ ఇటూ బంధుత్వాలను తగిలిస్తే ఆయన పేరు గుంటూరు శేషేంద్ర శర్మ..........

ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక,
(21 ఆగస్టు, 2000)

* * *

పుట్టిన ఊరు నెల్లూరు జిల్లా ఉదయగిరి తాలూకా నాగరాజుపాడు. భారత ప్రభుత్వ ‘రాష్ట్రేంద్రు’ బిరుదం, కలకత్తా రాష్ట్రీయ హిందీ అకాడమీ అవార్డు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ముఖ్య పురస్కారాలు.

గుంటూరు ఎ.సి. కాలేజీ నుంచి పట్టభద్రులు. మద్రాసు లా కాలేజీ నుంచి ‘లా’ డిగ్రీ. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో మున్సిపల్‌ కమీషనరుగా పనిచేసి, పదవీ విరమణ వేశారు.

నా దేశం - నా ప్రజలు, మండే సూర్యుడు, గొరిల్లా, సముద్రం నా పేరు, కవిసేన మేనిఫెస్టో, రక్తరేఖ, స్వర్ణహంస, కాలరేఖ, షోడశి, ఆధునిక మహాభారతం, జనవంశమ్‌ ప్రధాన రచనలు.


కవిత్వంలో, సాహిత్య విమర్శలో విలక్షుణులు. ప్రపంచ సాహిత్యం మీద, భారతీయ సాహిత్యం మీద సాధికారిక పరిచయం. సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషల్లో పండితులు, వచన కవిత్వం, పద్యరచన-రెండిరటి సమాన ప్రతిభావంతులు, ఆధునిక కవిత్వంలో విలక్షణ ఊహాశాలిత ఈయనప్రత్యేకత. వచన కవిత్వానికి ఒక కొత్త వాకిలి తెరిచిన స్వతంత్రులు. బహిరంతర ప్రకృతులకు తమ రచన ద్వారా వ్యాఖ్యానం పలికిన దార్శనిక కవి. ఒకానొక శైలీ నిర్మాత.
యువ నుంచి యువ దాకా (కవితాసంకలనం)
అ.జో. - వి. భొ. ప్రచురణలు 1999

శేషేంద్ర సాహిత్య జగత్తును జీవిత విశేషాలను ఈ కింది హోం పేజి లో దర్శించండి .

Seshendra : Visionary poet of the Millennium


ఆధునిక మహా భారతం

ఆధునిక మహా భారతం

గుంటూరు శేషేంద్రశర్మ.....నా దేశం నా ప్రజలుఅనేఆధునికమహాభారతము(నా దేశం – నా ప్రజలు, మండే సూర్యుడు, గొర్రిల్లా, అరుస్తున్న ఆద్మీ,సముద్రం నా పేరు, నీరై పారిపోయింది, ప్రేమ లేఖలు, శేషజ్యోత్స్న)***ముఖ్య వివరణఆధునిక మహాభారతం 1970 – 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటి వరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984 – 86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు. శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేషజ్యోత్స్న జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహాపర్వంగా, సముద్రం నా పేరు సముద్రపర్వంగా, ఇందులో రూపొందాయి.***అవతారిక"ఇది నా కావ్య సంకలనం కాదు ఇది నా కావ్యం నా సంపూర్ణ కావ్య..

₹450.00₹ Ex Tax: ₹450.00₹

ఎంత కాలం ఈ ఎండమావులు

ఎంత కాలం ఈ ఎండమావులు

గుంటూరు శేషేంద్రశర్మ తెలుగు సాహిత్యంలో, కాదు బహుశా విశ్వా సాహిత్యం లోనే ఒక అపూర్వ సందర్భం.ఒక సమకాలీన కవి, వామ పక్ష రాజకీయ దృక్కోణం నుంచి దేశ, విశ్వ పరిణామాల్ని విశ్లేషించి వ్యాఖ్యానించారు.ఈ ఘనత మన శేషేంద్ర కొక్కరికే దక్కుతుంది. దేశంలో కాంగ్రెస్ రాజకీయాల్ని, పాలక వర్గాల రాజకీయాల్ని దుయ్యబట్టారు.ఇక ప్రపంచ పటంలో సోవియెట్ యూనియన్ పతనానికి పాశ్చాత్య దేశాల పన్నాగాన్ని దనుమాడారు శేషేంద్ర.ఇంకా ఎన్నో ఆసక్తి కరమయిన వ్యాసాలూ ఇందులో....కొన్ని కవితలు అనుబంధంగా చేర్చారు. శేషేంద్ర అభిమానుల కోసం...***మహా కవి శేషేంద్ర 94వ జయంతి సందర్భంగా కవి కుమారుడు సాత్యకి అందిస్తున్న అరుదైన కానుక***గ్రంధాల కోసం సంప్రదించాల్సిన చిరునామా ....Saatyaki....S/O Late.G.Seshendra Sharma....32,Janatha Flats...Kanthi Sikhara Complex....Pungagutta(Opp:Model House)...Hyderabad....Telangana State : INDIA....Phone : 9441070985, 7702964402...Website:http://seshendrasharma.weebly.com..

₹125.00₹ Ex Tax: ₹125.00₹

కవిసేన మేనిఫెస్టో

కవిసేన మేనిఫెస్టో

గుంటూరు శేషేంద్రశర్మ ...*ఈనాడు కావలసింది సామాజిక చైతన్యం కాదు . సాహిత్య చైతన్యం*కవిత్వం బతుకు తెరువు కాదు .... జీవన విధానం*వచనంలో ఏది చెప్పాడనే దానికి స్దానమున్నట్లే కవిత్వంలో ఎట్లా చెప్పాడనే దానికే ప్రధాన స్థానం ఉంటుంది .*వర్తమాన తెలుగు మహా కవులు కవిత్వపు కల్తీ లేని స్వచ్చమయిన వచనమే రాస్తున్నారు .*ప్రతి కవితా ఎలా ఉండాలి ? ... .. చదివి పాఠకుడు చావాలి . కొత్త జన్మ ఎత్తాలి .*కవి నడుస్తున్న మానవతా సంక్షిప్త శబ్ద చిత్రం .- శేషేంద్ర* * *1977లో వచ్చిన ఈ కావ్య శాస్త్రం , అప్పట్లో సాహిత్యంలో అన్ని వర్గాలనూ , అన్ని సంఘాలనూ తీవ్రమయిన ఆందోళనకు , మనస్తాపానికి గురి చేసింది . నిజం అంత ప్రమాదకరమయింది . నేటికీ తెలుగు కవిత్వంలో అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి . మరింత తీవ్ర రూపం దాల్చాయని చెప్పవచ్చు . కనుకనే కవిసేన కావ్య శాస్త్రం అన్నికాలాలకూ వర్తిస్తుంది .* * *ఒక కవి రాశిన ఆధునిక కావ్యశాస్త్ర్రం - తెలుగుదేశంలో నూతనంగా కవిత్వభోధ అభివ్యాప్తం చెయ్యడానికి ప్రయత్నించే గ్రంథం-అపూర్వ చైతన్య వ్యాప్తి కోసం ఐతిహాసిక పరిస్థితుల్లో ఆవిర్భవించిన ఒక ఉద్యమపత్రం.సామాన్య శబ్దానికి అసమాన్య ఆకర్షణ శక్తి ప్రదానం చేసి..

₹200.00₹ Ex Tax: ₹200.00₹

కామోత్సవ్

కామోత్సవ్

KAMOTSAV...పేజీలు: 198, వెల.. 200 రూపాయలు ప్రచురణ: గుంటూరు శేషేంద్ర శర్మ మెమోరియల్‌ ట్రస్ట్‌ గ్రంధాల కోసం సంప్రదించాల్సిన చిరునామా ....Saatyaki ....S/O Late.G.Seshendra Sharma ....32,Janatha Flats...Kanthi Sikhara Complex ....Pungagutta(Opp:Model House) ....Hyderabad....Telangana State : INDIA...Phone : 9441070985, 7702964402....Website:http://seshendrasharma.weebly.com“నవల పాఠకుడి ద్వితీయ జీవితం భయంకర పాప పుణ్యాల బంధం నుంచి విముక్తి పొందిన అనుభూతి.... నవల ఒక మారిజువానా; ఒక కొకెయిన్ పొగ మేఘాలు నిండిన మేఘాల లోయ... నవల పాఠకుల చేత ఆజరామరత్వం అనుభవింపచేస్తుంది. పుస్తకాన్ని రచయిత రాయడు, పుస్తకం రచయితచేత రాయిస్తుంది...”శేషేంద్ర***కామోత్సవ్ నవల 1987లో ఆంధ్ర జ్యోతిలో ధారావాహికంగా వస్తున్నప్పుడే సంచలనం సృష్టించింది. శేషేంద్రను అరెస్ట్ చేయాలని కోరుతూ కోర్టులో క్రిమినల్ కేసు వేశారు. హై కోర్టు సుప్రీమ్ కోర్టు దాకా పోయింది. అన్ని కోర్టులలో న్యాయమూర్తులు కేసు కొట్టేశారు." ఇది నవల రూపంలో ఉన్న ఒక రజాకార్ పుంశ్చలిక నేర గాథ, జీవిత చరిత్ర, అంతరాత్మ కథ అంటున్నారు శేషేంద్ర కుమారుడు సాత..

₹200.00₹ Ex Tax: ₹200.00₹

జన వంశం

జన వంశం

గుంటూరు శేషేంద్ర శర్మ ...ఆధునిక మహాభారతముఅనుబంధ కావ్యంజనవంశమ్కావ్యకృతి(చంపూవినోదిని, ఋతుఘోష, పక్షులు, పద్య కావ్యాలు,తదనంతర వచన, గేయ, పద్య కవితలు)మానవ సమాజంలో యుగయుగాన దీర్ఘకాలానంతరం ఐతిహాసిక కావ్యాలు ఉత్పన్నమవుతూ వచ్చాయి. అవి తత్తద్యుగీన తత్త్వాన్ని ప్రదర్శించేవి. ఇతిహాసం యుగీనవాణి, పూర్వకాలంలో వచ్చిన ప్రతి ఇతిహాసానికి ఒక అనుబంధ కావ్యం ఉండేది – ప్రాచ్య దేశాల్లో గానీ పాశ్యాత్యదేశాలలో గానీ. వాల్మీకి రచిత రామాయణానికి ఉత్తరకాండ అనుబంధ కావ్యము. అట్లాగే వ్యాస మహాభారతానికి అనుబంధకావ్యం హరివంశమ్. ఇదేవిధంగా ప్రాచీనకాలంలో గ్రీసులో వచ్చిన జగద్విదితమైన హోమర్ విరచిత ఇలియడ్ అనే ఇతిహాసానికి అడిస్సీ అనుబంధ కావ్యం. ఇతిహాస కావ్యరచనా ప్రక్రియానుసారంగా ఆధునిక మహాభారతానికి అనుబంధకావ్యంగా ఈ జనవంశమ్ వచ్చింది.*****జనవంశమ్ ఆధునిక మహాభారతము కావ్యేతిహాసానికి అనుబంధ కావ్యం. ఆధునిక మహాభారతము పూర్తిగా వచనకవిత. జనవంశమ్ దీనికి భిన్నమైంది. ఇందులో ఛందోబద్ధ పద్యాలు, గేయాలు, పాటలు, వచన కవితలు, చమత్కారికలు అన్నీ ఉన్నాయి. భావతీవ్రత, అభివ్యక్తి ఉష్ణోగ్రత అదే స్థాయిలో ఉంటాయి. స్థాయీ భేదాలుండే వివిధ వర్గాల పాఠకులందరినీ తప్పక ..

₹400.00₹ Ex Tax: ₹400.00₹

షోడశి

షోడశి

గుంటూరు శేషేంద్ర శర్మ ....మానవాళికో పరమౌషధం... వాల్మీకీ ‘రామాయణం’రామాయణం కథ ఒక పాఠ్యాంశంగా పిల్లల చేత చదివిస్తారు. సీతారాముల్ని ఆదిదంపతులుగా పెద్దలు కొలుస్తారు. ఇక పారాయణం సంగతి చెప్పనక్కర్లేదు. వాల్మీకి రామాయణాన్ని ఒక సులభమైన కథగా చెప్పి ఊరుకున్నాడా? కాదంటున్నారు శేషేంద్రశర్మ.వాల్మీకి రామాయణం అంతరాత్మ అవగతం అవడానికి శాస్త్ర పరిజ్ఞానం అవసరమని, అందులో రహస్యంగా దాగి వున్న రుషి హృదయం. శాస్త్ర పరిజ్ఞానం ద్వారానే ఆకళింపునకు లొంగుతుందని విశ్లేషించారు. మరి శాస్త్ర పరిజ్ఞానం అందరికీ అందేది కాదు కదా!‘‘శాస్త్రములు పండితుల కొరకే’’ అన్న వాదం ‘‘కొందరు స్వార్థపరులైన పండితులు, కొందరు సోమరులైన పామరులు కలిసి చేసిన కుట్ర, కల్పించిన భ్రాంతి’’ అన్నది శేషేంద్రగారి నిశ్చితాభిప్రాయం. సాహిత్యం, శాస్త్రం పట్ల ఇలాంటి నిజాయితీ యుతమైన ప్రజాస్వామిక దృక్పథం ఉన్న శేషేంద్ర రామాయణంలో వాల్మీకి దాచిన రహస్యాల్ని ప్రజానీకానికి విడమరిచి చెబుతున్నారు. వాల్మీకి మహర్షి కుండలినీ యోగమనే పరమౌషధాన్ని మానవాళికి బహూకరించాడని, అనుష్టుప్‌ ఛందస్సులో ఉన్న వాల్మీకి కవిత ఆ ఔషధానికి తేనెపూత అనీ అనన్య అంతర్మథనంతో, అసాధారణ విద్వత్తుతో వ్య..

₹375.00₹ Ex Tax: ₹375.00₹

సాహిత్య దర్శిని

సాహిత్య దర్శిని

గుంటూరు శేషేంద్ర శర్మ....గుంటూరు శేషేంద్ర శర్మను మళ్ళీ తెలుసుకుందాంశేషేంద్ర సృజన రచయిత మాత్రమే కాదు. విమర్శకుడు కూడా. విమర్శించే కావ్యంలో విమర్శకులు పరిశీలించాల్సిన అంశాలు ఆయన దృష్టిలో మూడు. ఒకటి అలంకారం, రెండు భాష, మూడు వస్తువు. మూడూ మూల ద్రవ్యాలే అయినా వీటిలో సృష్టి అనదగినది మాత్రం అలంకారమేనంటాడు. అలంకార సృష్టి క్రమంలో భాష కూడా మార్పు చెందుతుందని చెబుతాడు. ఈ విమర్శ సూత్రాన్ని శేషేంద్రకే అన్వయిస్తే ఆయన కవిత్వం ప్రధానంగా అలంకారమయం - ఉపమను ప్రతీక స్థాయికి ఎదిగించి కవిత్వాన్ని జెండాగా ఎగరేశాడాయన. ఆ క్రమంలోనే నూతన భాషను సృష్టించాడు. వస్తువు దాని ఔగాములు, సంబద్ధాలు, సందర్భాలు, విప్లవోద్యమ గమనంతో, తాత్వికతతో వున్న సంవాదం పూర్తిగా అప్రధానం అయిపోయాయి. వాటి మీద జరగవలసిన చర్చ, విశ్లేషణ జరిగితేనే కానీ శేషేంద్ర కమ్యూనిజాన్ని ఎలా అర్థం చేసుకొన్నాడు. ఏ మేరకు స్వీకరించాడు అనే విషయాలు తేలవు.కవిత్వానికి గీటురాయి అనుభూతి అన్నది శేషేంద్ర నిశ్చితాభిప్రాయం. జీవితంలో అనేక అనుభూతులుంటాయి. స్వానుభూతి కావచ్చు, సహానుభూతి. దానితో పాటు ప్రేమ మొదలైన అనుభూతులు వుంటాయి అంటాడాయన. ఎప్పుడు ఏది అనుభూతికి వస్తే అప్పుడది..

₹300.00₹ Ex Tax: ₹300.00₹

Showing 1 to 7 of 7 (1 Pages)