G-GB3W50CLMM

డా. మంగళగిరి శ్రీనివాసులు

డా. మంగళగిరి శ్రీనివాసులు

డా. మంగళగిరి శ్రీనివాసులు

డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువకవి, రచయిత, పరిశోధకుడు. వృత్తిరీత్యా సహాయ ఆచార్యులు, పాలమూరు విశ్వవిద్యాలయం .


జననం: డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు

10.01.1985.న
గ్రామం : బోయిన్ పల్లి, మండలం : మిడ్జిల్,
జిల్లా ప్రాంతం:మహబూబ్ నగర్ 

వృత్తి:సహాయ ఆచార్యులు, పాలమూరు విశ్వవిద్యాలయం. ప్రసిద్ధి:కవి,రచయిత, పరిశోధకులు,విమర్శకులు.

తల్లిదండ్రులు:శ్రీమతి మంగళగిరి శంకర్ బాయి,
శ్రీ మంగళగిరి రామచందర్ జీ,
సతీమణి : శ్రీమతి మంగళగిరి తులసి బాయి, M.A.(TELUGU),T.P.T.
వివాహం:25/04/2014, 
సంతానం:చిరంజీవి మంగళగిరి శాష్మిత్ సాయి ప్రథమ పుత్రుడు (6y)
చిరంజీవి మంగళగిరి కార్తిక్ సాయి ద్వితీయ పుత్రుడు (5y)

మతం:హిందూ

మెయిల్:mangalagiri.srinivas@gmail.com


జీవిత విశేషాలు:

మంగళగిరి శ్రీనివాసులు రామచందర్ జీ ,శంకర్ బాయి దంపతులకు 5వ సంతానంగా మహబూబ్ నగర్ జిల్లా బోయిన్ పల్లి గ్రామంలో జన్మించాడు.





విద్యాబ్యాసం సవరించు


మంగళగిరి శ్రీనివాసులు

ప్రాధమిక విద్యను స్థానిక పాఠశాల బోయిన్ పల్లి లో,ఉన్నత విద్య ZPHS మిడ్జిల్ లో, ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మిడ్జిల్ లో, డిగ్రీ విద్య కల్వకుర్తి లో,తెలుగు పండిత శిక్షణ ఉపాధ్యాయ విద్యను SVTPT మిర్యాలగూడలో, వీటితో పాటు స్నాతకోత్తర విద్య ఎం.ఏ తెలుగును ఉస్మానియ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసి,UGC NET ప్రథమ ప్రయత్నంలోనే సాధించి ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి

ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) అనే అంశంపై పిహెచ్.డి పరిశోధన చేసి

2018లో  నుంచి డాక్టరేట్ పట్టాను పొందాడు.

పలు సాహిత్య  సాంస్కృతిక సంస్థలలో  క్రియాశీలకంగా పనిచేస్తూ అటు వృత్తిలో ఇటు సాహిత్యంలో మంచి పేరును సాదించుకున్నారు.


ఉద్యోగ జీవితం:


తెలుగు పండిత శిక్షణ అనంతరం తెలుగు ఉపాధ్యాయులుగా నవ్య గ్రామర్ ఉన్నత పాఠశాలలో 2009-2010, హైమవతి ఉన్నత పాఠశాలలో,

తెలుగు ఉపాధ్యాయులుగా, జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాల అధ్యాపకులుగా,

పోటీపరీక్షల తెలుగు బోధకుడిగా పలు వివిధ విద్యాసంస్థలలో పనిచేసి అనుభవం.

స్నాతకోత్తర కేంద్రం,గద్వాల, పాలమూరు విశ్వవిద్యాలయం లో సహాయ ఆచార్యులు(C)గా పనిచేస్తున్నారు.


రచనల జాబితా:

1.ఆరెకటిక కులగోత్ర వృత్తి పురాణం

2.సంగడి సాహిత్య వ్యాసాల సంపుటి

3.ఆంధ్ర సారస్వత పరిషత్తు తెలుగు భాషా సాహిత్య సేవ (నేటి తెలంగాణ సారస్వత పరిషత్తు) సిద్ధాంత గ్రంధం.అను పుస్తకాలను వెలువరించారు.


కవితలు,కథలు,పాటలు,పద్యాలు,వ్యాసాలు,పలు ప్రక్రియలలో రచనలు వెలువరిస్తున్నారు.

మొగ్గలు ఆధునిక మినివచన కవిత ప్రక్రియలోను కవితలు రాశారు.



పురస్కారాలు:

కులసాహిత్యరత్న 2015,

బంగి బాలయ్య స్మారక సాహిత్య అవార్డు 2016,

ఉత్తమకవి సత్కారం 2016,

జాతీయ ఎక్సలెన్స్ అవార్డ్ కటిక్ శిరోమణి 2016,

ప్రపంచ తెలుగు మహాసభలు కవిపండిత సన్మానం 2017,

ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టా ప్రదానం 2018 ,

సేవభారతి పురస్కారం 2019,

గాంధీ సాహిత్య రత్న అవార్డు 2020,

మరియు అంతర్జాతీయ, జాతీయ సదస్సులలో కవిసమ్మేళనాలలో సత్కరాలు,సన్మానాలు
అందుకున్నారు.


సాహిత్యంలో వీరు రాష్ట్ర, జాతీయ,అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు.కేంద్ర సాహిత్య అకాడమీ, యు.జి.సి సెమినార్లలో పాల్గొన్నారు.10కి పైగా అవార్డులను అందుకున్నారు. వీరి కవితలకు,కథలకు బహుమతులు కూడా వచ్చాయి. వీరి కవితలు, గేయాలు,కథలు, వ్యాసాలు, సమీక్షలు అనేక దిన,వార,మాస,త్త్రైమాసిక,వార్షిక పత్రికలలో వెలువడ్డాయి.


అరెకటిక కుల గోత్ర వృత్తి పురాణం

అరెకటిక కుల గోత్ర వృత్తి పురాణం

అరెకటిక కుల గోత్ర వృత్తి పురాణంRs. 75డా. మంగళగిరి శ్రీనివాసులుబోయిన్ పల్లి, మండలం :మిడ్జిల్, జిల్లా ప్రాంతం:మహబూబ్ నగర్91 94913 88662మెయిల్:mangalagiri.srinivas@gmail.com..

₹75.00₹ Ex Tax: ₹75.00₹

తెలుగు భాషా సాహిత్య సేవ

తెలుగు భాషా సాహిత్య సేవ

తెలుగు భాషా సాహిత్య సేవRs. 300డా. మంగళగిరి శ్రీనివాసులుబోయిన్ పల్లి, మండలం : మిడ్జిల్, జిల్లా ప్రాంతం:మహబూబ్ నగర్91 94913 88662మెయిల్:mangalagiri.srinivas@gmail.com..

₹300.00₹ Ex Tax: ₹300.00₹

సంగిడి ( సాహిత్య వ్యాసాలు)

సంగిడి ( సాహిత్య వ్యాసాలు)

సంగిడి ( సాహిత్య వ్యాసాలు)Rs. 100డా. మంగళగిరి శ్రీనివాసులుబోయిన్ పల్లి, మండలం :మిడ్జిల్, జిల్లా ప్రాంతం:మహబూబ్ నగర్91 94913 88662మెయిల్:mangalagiri.srinivas@gmail.com..

₹100.00₹ Ex Tax: ₹100.00₹

Showing 1 to 3 of 3 (1 Pages)