G-GB3W50CLMM

Dr KAPPAGANTU RAMA KRISHNA

Dr KAPPAGANTU RAMA KRISHNA

Dr KAPPAGANTU RAMA KRISHNA

డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ఎం.ఎస్‌సి (మ్యాథ్స్‌), ఎం.ఎ (తెలుగు), ఎం.ఎ (సైకాలజి), ఎం.ఎ (జర్నలిజం), ఎం.ఇడి చేశారు. 'గణితంలో సహపాఠ్య కార్యక్రమాలు' అనే అంశంపై ఎం.ఫిల్‌, 'కృష్ణాజిల్లా పత్రికారంగం' అనే అంశంపై పిహెచ్‌.డి చేశారు. ఉద్యోగరీత్యా విజయవాడ, గాంధీనగర్‌లోని ఎస్‌.ఆర్‌.ఎస్‌.వి.కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. రామకృష్ణ పిహెచ్‌.డి థీసిన్‌ను బి.ఎ విద్యార్థులకు రిఫరెన్స్‌ బుక్‌గా యు.జి.సి. ప్రకటించింది. 

రచయితగా

- ఈనాడు దినపత్రిక మకరందం పేజీలో 200కు పైగా ఆధ్యాత్మిక వ్యాసాలు

- భక్తి, ఋషిపీఠం, సప్తగిరి, బాల భారతం, తెలుగు వెలుగు, శ్రీశైలప్రభ, శ్రీకనకదుర్గప్రభ, గ్రంథాలయ సర్వస్వం తదితర పత్రికల్లో వందలాది వ్యాసాలు

- డి.ఎల్‌.ఇడి విద్యార్థులకు గణిత బోధన పద్ధతులు పాఠ్యపుస్తకం (ఆంధ్రప్రదేశ్‌ ఎస్‌.సి.ఇ. ఆర్‌.టి ప్రచురణ)

- డీఈడీ, బీఈడీ విద్యార్థుల కోసం తెలుగు బోధన పద్ధతులు, తెలుగు వ్యాకరణం, కళావిద్య, పాఠశాల నిర్వహణ, ప్రాథమిక విద్య, ఆధునిక భారతదేశంలో విద్య తదితర 15 విద్యావిషయక పాఠ్యపుస్తకాలు

- ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ 8, 10 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాలు

- పిల్లల ప్రవర్తన - తల్లిదండ్రుల పాత్ర, కౌమారదశ సమస్యలు - పరిష్కారాలు, వయోజన దశ - సర్దుబాటు, మధ్యవయస్సు - బాధ్యతలు, వృద్ధాప్యం - పిల్లల పాత్ర, విద్య ఉద్యోగ మార్గదర్శకత్వం (తెలుగు అకాడమి, హైదరాబాదు ప్రచురణ)

- నిత్యోత్సవం, శ్రీకృష్ణదేవరాయలు, మనసు మాట - గెలుపు బాట, అమ్మా నాన్నా బుజ్జాయి, ఓ వయోలిన్‌ కథ తదితర 20 ఇతర పుస్తకాల రచన

- ఎన్‌.ఐ.ఒ.ఎస్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూల్‌) పాఠ్యపుస్తకాల అనువాదం

- ఇగ్నో కోర్సుల స్టడీమెటీరియల్‌ అనువాదం

ఇతర కార్యక్రమాలు

- గణితచంద్రిక త్రైమాసిక పత్రిక సంపాదకమండలి సభ్యుడు

- 'దర్శనం' ఆధ్యాత్మిక మాస పత్రిక సహాయ సంపాదకుడు

- 35 జాతీయ, 5 అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ

- రెండు జాతీయ సదస్సుల నిర్వహణ

- ఆకాశవాణి కేంద్రం ద్వారా 30కి పైగా కార్యక్రమాలు

- విజయవాడ దూరద్శన్‌ కేంద్రం ద్వారా పలు ఇంటర్వ్యూలు, కమిసమ్మేళనాలు, చర్చాగోష్ఠులు

- ఆకాశవాణి వాణి వ్యాఖ్యాతల నియామక సంఘం సభ్యుడు

- ఇగ్నో వార్షిక పరీక్షల పరిశీలకుడు

- కృష్ణా యూనివర్శిటీ ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృంద సభ్యుడు

- అనేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామక సంఘ సభ్యుడు

- అనేక పాఠశాలలు, కళాశాలల్లో గౌరవోపన్యాసాలు

- అష్టావధానాలు, శతావధానాల్లో పృచ్ఛకుడు

- భువనవిజయం వంటి సాహితీరూపకాల్లో పాత్రధారి

- వివిధ పోటీలు, విజ్ఞాన ప్రదర్శనలకు న్యాయనిర్ణేత

- సాహిత్య కార్యక్రమాలకు వ్యాఖ్యాత


Aandhrula aatmajyothi  SRIKURUSHNA DEVARAYALU

Aandhrula aatmajyothi SRIKURUSHNA DEVARAYALU

Aandhrula aatmajyothiSRIKURUSHNA DEVARAYALURs.27/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.                                email: krkrishna2011@gmail.comశ్రీ కృష్ణ దేవరాయలు అనగానే సమున్నతమైన తెలుగువారి చరిత్ర కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. చూపు తిప్పుకోనివ్వని శిల్పసంపద, ఎంత చదివినా తనివితీరని సాహిత్య సంపద మన ముందు నిలబడతాయి. తెలుగు వారందరికీ రాయలు గర్వకారణం. యుద్ధానికి వెళ్తూ కూడా కవుల్ని వెంట తీసుకెళ్ళిన సాహితీప్రియుడు రాయలు. అష్టదిగ్గజాలు మనకందించిన మహానుభావుడు. శ్రీ కృష్ణ  దేవరాయల జీవితచరిత్ర నేటితరానికి అర్థమయ్యేలా తేలికైన భాషలో రాసిన పుస్తకం ఇది. ఖరీదు రూ.27..

₹27.00₹ Ex Tax: ₹27.00₹

AMMA NANNA BUJJAYI

AMMA NANNA BUJJAYI

AMMA NANNA BUJJAYIRs.126/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.                                email: krkrishna2011@gmail.comచిన్పపిల్లల పెంపకం తల్లిదండ్రులకు కత్తిమీద సాము లాంటిది. నేటి తరం పిల్లలు కంప్యూటర్ వేగంతో ఆలోచిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పిల్లల్ని పెంచాలంటే వారి మనస్సుల్లోకి తొంగి చూడాల్సిందేే. బాలల ప్రవర్తన ఏయే సందర్భాల్లో ఎలా ఉంటుంది? దాన్ని కనిపెట్టటం ఎలా? పిల్లల ప్రవర్తన తీర్చిదిద్దటానికి మార్గాలేమిటి? పిల్లలు తప్పులు చేస్తే ఎలా దండించాలి? మొదలైన విషయాలన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. పుస్తకం ఖరీదు రూ.126..

₹126.00₹ Ex Tax: ₹126.00₹

BHAKTI MAKARANDAM 1

BHAKTI MAKARANDAM 1

BHAKTI MAKARANDAM 1Rs.99/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ , ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్), (వయా) మిల్క్ ఫ్యాక్టరీ, విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా. సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.                                 email: krkrishna2011@gmail.comమన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు,  ఆచార వ్యవహారాల్లో అనంతమై విజ్ఞానం దాగి ఉంది.  ప్రతి పురాణగాధలోనూ ఓ ఔచిత్యం ఉంది. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో వీటిలో ఉన్నాయి. పుక్కిటి పురాణాలుగా కాకుండా పట్టుబట్టి నేర్చకోవాల్సిన అంశాలుగా వీటిని మనం చూడాలి. ప్రతి పండుగలోనూ ఓ సందేశం. ప్రతి కథలోనూ ఓ చైతన్యం. అన్నీ కలిస్తే భారతీయతకు ప్రతిరూపం. వివిధ పత్రికల్లో ఈ అంశాల మీద రాసిన వ్యాసాల సమాహారమే ఈ రెండు పుస్తకాలు. ఖరీదు : భక్తి మకరందం మొదటిభాగం రూ.99..

₹99.00₹ Ex Tax: ₹99.00₹

BHAKTI MAKARANDAM 2

BHAKTI MAKARANDAM 2

BHAKTI MAKARANDAM 2Rs.108/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.email: krkrishna2011@gmail.comమన ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు,  ఆచార వ్యవహారాల్లో అనంతమై విజ్ఞానం దాగి ఉంది.  ప్రతి పురాణగాధలోనూ ఓ ఔచిత్యం ఉంది. మనిషిని మనీషిగా తీర్చిదిద్దే స్ఫూర్తిదాయకమైన అంశాలెన్నో వీటిలో ఉన్నాయి. పుక్కిటి పురాణాలుగా కాకుండా పట్టుబట్టి నేర్చకోవాల్సిన అంశాలుగా వీటిని మనం చూడాలి. ప్రతి పండుగలోనూ ఓ సందేశం. ప్రతి కథలోనూ ఓ చైతన్యం. అన్నీ కలిస్తే భారతీయతకు ప్రతిరూపం. వివిధ పత్రికల్లో ఈ అంశాల మీద రాసిన వ్యాసాల సమాహారమే ఈ రెండు పుస్తకాలు. ఖరీదు : భక్తి మకరందం  రెండవభాగం రూ.108..

₹108.00₹ Ex Tax: ₹108.00₹

MANASU MATA GELUPU BATA

MANASU MATA GELUPU BATA

MANASU MATA GELUPU BATARs.54/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.                                email: krkrishna2011@gmail.comఆధునిక విద్యారంగంలో అంతటా పోటీ. ఎల్ కె జి నుంచి ఇంజినీరింగ్, మెడిసిన్ వరకు అంతా పోటీ పోటీ. ఉరుకులు పరుగుల జీవితం. పుస్తకం పట్టకున్నది మొదలు ర్యాంకులు, గ్రేడ్ల గురించ ఆందోళన. ఓ పక్క తల్లిదండ్రులు, మరోపక్క టీచర్ల ఒత్తిడి. మొత్తంగా విద్యార్థి మనసులో తట్టుకోలేనంత ఒత్తిడి. మరి ఈ ఒత్తిడిని తట్టుకుని నిలబడటం ఎలా? చక్కటి భవిష్యత్తుకు పునాది వేసుకోవటం ఎలా? నల్లేరు మీద నడకలా పోటీ ప్రపంచాన్ని తట్టుకుని నిలబడి ర్యాంకులు ఎలా సాధించాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ పుస్తకంలో దొరుకుతాయి. విద్యార్థులకు ఈ పుస్తకం ఓ మార్గదర్శి...

₹54.00₹ Ex Tax: ₹54.00₹

O VAYOLIN KATHA

O VAYOLIN KATHA

O VAYOLIN KATHARs.207/- డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా.సెల్ నంబరు : 90320 44115 / 8897 547548.                                email: krkrishna2011@gmail.comవైలెన్ రంగంలో తిరుగులేని పేరు సొంతం చేసుకున్న విద్వాంసులు అన్నవరపు రామస్వామి. మంగళంపల్లి బాలమురళికి బాల్యమిత్రుడు. సంగీతరంగంలో ఆయనొక హిమాలయ శిఖరం. గేదెలు మేపుకున్న బాల్యం నుంచి స్వర్ణకంకణ సత్కారం అందుకున్న దశకు ఎదిగిన అద్భుతమైన జీవితచరిత్ర ఆయనది. ఆయన జీవితంలోని ప్రతి ఘట్టం నేటి తరానికొక పాఠం. ముఖ్యంగా సంగీత విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సంగతులెన్నో ఈ పుస్తకంలో ఉన్నాయి. ధర రూ.207..

₹207.00₹ Ex Tax: ₹207.00₹

అందమైన  ఆంధ్రప్రదేశ్

అందమైన ఆంధ్రప్రదేశ్

అందమైన  ఆంధ్రప్రదేశ్ANDAMAINA ANDHRAPRADESHRs : 27...డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,...ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),...(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,...విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా....సెల్ నంబరు : 90320 44115 / 8897 547548....                                email: krkrishna2011@gmail.com రాష్ట్ర విభజన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్ లో మిగిలిన జిల్లాలు, వాటి విస్తీర్ణం, జనాభా, పరిశ్రమలు, స్థానిక వనరులు, నదులు, మండలాలు, పర్యాటక కేంద్రాలతో సహా రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు సంబంధించిన ప్రస్తుత సమాచారంతో పాటు జిల్లా చరిత్ర కూడా ఈ పుస్తకంలో ఉంది. ప్రతి జిల్లా మ్యాప్ కూడా ఇందులో ఉంది. ప్రతి పేజీ పూర్తిగా రంగుల్లో ముద్రించటం పాఠకులకు సౌకర్యాన్ని కలిగిస్తుంది...

₹27.00₹ Ex Tax: ₹27.00₹

కార్తీక పురాణము

కార్తీక పురాణము

కార్తీక పురాణము KARTIKA PURAANAMURs: 45/-...డా. కప్పగంతు రామకృష్ణ ...ప్రతులకు సంప్రదించండి:...శ్రీ రాఘవేంద్ర ప్రచురణలు,... దిట్టకవి రాఘవేంద్ర రావు వీధి,... ఇన్నర్ రింగ్ రోడ్ , అంబపురం, ...విజయవాడ రూరల్ - 520012...ఆంధ్రప్రదేశ్, ఇండియా,...Ph.: 0866 2436959, 2438959...Cell : 94948 75959, 9493875959, 95928 75959... ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణాలోని అన్ని బుక్ షాపులుఅంబేద్కర్ కాలేజీ రోడ్,...చిక్కడపల్లి, హైదరాబాద్ - 500090...Cell: 90324 28516.....

₹45.00₹ Ex Tax: ₹45.00₹

కృష్ణా జిల్లా పత్రికా రంగం

కృష్ణా జిల్లా పత్రికా రంగం

కృష్ణా జిల్లా పత్రికా రంగం ....KRUSHNA JILLA PATRIKA RANGAM....Rs : 162...డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,...ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),...(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,...విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా....సెల్ నంబరు : 90320 44115 / 8897 547548....                                email: krkrishna2011@gmail.comపత్రికలకు పుట్టినిల్లు కృష్ణాజిల్లా. స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు సైతం పత్రికలు ఎంతగానో శ్రమించాయి. నాటి నుంచి నేటి వరకూ పత్రికలు సమాజంలోని ప్రతి రంగానికి తమవైన సేవ చేస్తూనే ఉన్నాయి. పత్రికలంటే కేవలం దినపత్రికలు మాత్రమే కాదు. లిఖిత పత్రికల వంటి అరుదైన రూపాలు, వ్యవస్థలూ మరెన్నో ఉన్నాయి. పత్రికలంటే కేవలం సమాచారాన్ని చేరవేసే సాధనాలు మాత్రమే కావు. సమాజ గతిని మలుపు తిప్పే శక్తి కూడా పత్రికలకు ఉంది. పత్రికలకు సంబంధించి ఇలాంటి అరుదైన విశేషాలతో సాగుతుందీ పుస్తకం...

₹162.00₹ Ex Tax: ₹162.00₹

తెలుగు - ఇంగ్లీస్  నిఘంటువు

తెలుగు - ఇంగ్లీస్ నిఘంటువు

తెలుగు - ఇంగ్లీస్  నిఘంటువు  ....TELUGU - ENGLISH  DICTIONARY ....Rs : 126 /- ...డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,...ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),...(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,...విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా....సెల్ నంబరు : 90320 44115 / 8897 547548....                                email: krkrishna2011@gmail.comరోజూవారీ వ్యవహారంలో ఉపయోగించే తెలుగు పదాలకు సరైన ఇంగ్లిషు పదాలు ఇవ్వటంతో పాటు వాక్యాల్లో వాటిని ఎలా ఉపయోగించాలో నేర్పుతుందీ పుస్తకం. క్లిష్టమైన తెలుగు పదాలకు ఇంగ్లిషు సమానార్థకాలతో పాటు, కఠినమైన ఇంగ్లిషు పదాలను ఎలా ఉచ్చరించాలో కూడా ఇందులో ఉంది. ప్రతి పదాన్ని ఇంగ్లిషు, తెలుగుల్లో ఎలా ప్రయోగించాలో వివరించే వాక్యప్రయోగాలు కూడా ఇందులో ఉన్నాయి. సాధారణ నిఘంటువులకు ఇది విభిన్నంగా, విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది...

₹126.00₹ Ex Tax: ₹126.00₹

నిత్యోత్సవం

నిత్యోత్సవం

నిత్యోత్సవం ....NITYOTSAVAM....Rs : 75...డాక్టర్‌ కప్పగంతు రామకృష్ణ ,...ఇంటి నంబరు 4-89, కొత్తూరు తాడేపల్లి (పోస్ట్),...(వయా) మిల్క్ ఫ్యాక్టరీ,...విజయవాడ - 5200012. కృష్ణా జిల్లా....సెల్ నంబరు : 90320 44115 / 8897 547548....                                email: krkrishna2011@gmail.comమన తెలుగువారి కాలమానంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఫాల్గుణ అమావాస్య వరకు ప్రతి రోజూ పండగే. నిత్యం ఓ ఉత్సవమే. అలా ఏడాడిలోని ప్రతి రోజు ఏయే ఆచారాలు పాటించాలో, ఏయే వ్రతాలు, పూజలు, నోములు చెయ్యాలో వివరించటంతో పాటు ఆయా ఆచారాలు ఏర్పడటానికి కారణం, వాటిలోని ఆధ్యాత్మిక, సామాజిక, వైజ్ఞానిక కోణాలను వివరిస్తుందీ పుస్తకం. ఏడాదిలోని ప్రతి రోజు ప్రత్యేకత వివరించటం ఈ పుస్తకం ప్రత్యేకత...

₹75.00₹ Ex Tax: ₹75.00₹

Showing 1 to 11 of 11 (1 Pages)